బాలీవుడ్ పాటకు ఆఫ్గాన్ క్రికెటర్లు స్టెప్పులు

బాలీవుడ్ పాటకు ఆఫ్గాన్ క్రికెటర్లు స్టెప్పులు

అఫ్గాన్‌ ఆటగాళ్లు బాలీవుడ్ పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోనే ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో ఓవర్‌వెయిట్‌ బ్యాట్స్‌మన్‌ మొహమ్మద్‌ షహజాద్‌తో పాటు యువ స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌లు స్టెప్పులు వేశారు. చాలా సరదాగా ఉన్న ఈ వీడియోనే ఐసీసీ షేర్‌ చేస్తూ.. ఒకవేళ ప్రపంచకప్‌లో అత్యంత వినోదాత్మక జట్టు అవార్డు ఇవ్వాల్సివస్తే అది అఫ్గాన్‌కే దక్కుతుందని కామెంట్‌లో రాసింది. ప్రస్తుతం ఐసీసీ షేర్‌ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.