హైదరాబాద్ స్టోర్ ప్రారంభానికి ఐకియా సీఈఓ

హైదరాబాద్ స్టోర్ ప్రారంభానికి ఐకియా సీఈఓ

వచ్చే గురువారం భారత్ లో తొలి స్టోర్ ను హైదరాబాద్ లో ఐకియా ప్రారంభిస్తోంది. దాదాపు 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమైన ఈ స్టోర్ ప్రారింభిచేందుకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జెస్పర్ బ్రోడిన్ వస్తున్నారు. ఆయనతోపాటు పలువురు కంపెనీ ప్రతినిధులు కూడా వస్తారని కంపెనీ ఓ పత్రిక ప్రకటనలో పేర్కొంది. ఈ స్టోర్ ను జులై 19నే ప్రారంభించాల్సి ఉండగా, ఏమాత్రం రాజీలేకుండా క్వాలిటీ ప్రొడక్ట్స్ తో పాటు సౌకర్యాలు కల్పించేందుకు ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 9కి వాయిదా వేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి అన్ని విధాలా సాయం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
మరో ఐకియా తన వెబ్ సైట్ ను ప్రారంభించింది. స్టోర్ లోని సౌకర్యాలతో పాటు లేటెస్ట్ స్టాక్, ఆఫర్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్ సైట్  (https://www.ikea.com/in/en/)లో ఉంచారు.