సమాచార కమిషనర్ గా ఐలాపురం రాజా ప్రమాణం

సమాచార కమిషనర్ గా ఐలాపురం రాజా ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ గా ఐలాపురం రాజా నియమితులయ్యారు. సచివాలయంలో రాజాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలే ఆయన నియామకంపై ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్‌ ఆమోదించారు. దీంతో ఆయన నియామకంపై మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లు ఉంటారు. ఒకవేళ ఈలోపే 65 ఏళ్లు నిండితే అక్కడితో పదవీకాలం ముగుస్తుందని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఆ గెజిట్‌లో పేర్కొన్నారు.