సినిమాలు లేకపోయినా.. ఇల్లీ బ్యూటీ అస్సలు తగ్గడంలేదు..!!

సినిమాలు లేకపోయినా.. ఇల్లీ బ్యూటీ అస్సలు తగ్గడంలేదు..!!

ఇలియానా.. ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్.  2006లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఎంట్రీ సినిమానే సూపర్ హిట్  కావడంతో ఇలియానా దశతిరిగింది.  తన రెండో సినిమా మహేష్ బాబుతో పోకిరి రూపంలో వచ్చింది.  పోకిరి అప్పట్లో ఇండస్ట్రీ హిట్.  రెండు వరస హిట్స్ కొట్టడంతో టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించింది.  ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.  

కెరీర్లో ఎంత స్పీడ్ గా ఎదిగిందో అంటే స్పీడ్ గా డౌన్ కావడం మొదలుపెట్టింది. 2010 తరువాత ప్లాప్ లు మొదలయ్యాయి.  అక్కడి నుంచి బాలీవుడ్ వెళ్లి బర్ఫీ రూపంలో హిట్ అందుకుంది.  మరలా ఆ స్థాయిలో హిందీలో హిట్ రాలేదు పాపం ఇల్లీబ్యూటీకి. బాలీవుడ్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో మరలా టాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసింది.  విచిత్రం ఏమంటే.. ఇలియానాలో టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా.. అదృష్టం వెక్కిరించడంతో ఆ సినిమా కూడా కలిసి రాలేదు.  ప్రస్తుతం హిందీలో పాగల్పాంటి అనే సినిమా ఒక్కటే చేతిలో ఉన్నది.  అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదిలేదని అంటోంది ఇలియానా.  వీలు దొరికినప్పుడల్లా బికినీ ఫొటోలతో రెచ్చిపోతూ స్కిన్ షోలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది.