గోవా బ్యూటీ ఇలా మారిందేంటి...

గోవా బ్యూటీ ఇలా మారిందేంటి...

చేతిలో నాలుగు సినిమాలు ఉన్నప్పుడే అందం గురించి ఆలోచిస్తారు.  అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు.  కెరీర్లో సినిమాలు రావడం తగ్గిపోతే... క్రమంగా అందంపై శ్రద్ద కొద్దిగా సన్నగిల్లుతుంది.  గోవా బ్యూటీ ఇలియానా విషయంలోనూ జరిగింది.  దేవదాస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా ఇలియానా.. తరువాత టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేసింది.  మహేష్ తో చేసిన పోకిరి, పవన్ కళ్యాణ్ తో చేసిన జల్సా సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు.  

దేవుడు చేసిన మనుషులు సినిమా తరువాత ఈ బ్యూటీ టాలీవుడ్ కు టాటా చెప్పింది.  బాలీవుడ్ లో బోలెడు సినిమాలు చేసి... రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.  రీ ఎంట్రీతో అభిమానులు షాక్ అయ్యారు.  బొద్దుగా ఉండటంతో కామెంట్లు వచ్చాయి.  వీటికి సమాధానంగా ఇలియానా తిరిగి సన్నగా మారి నాజూగా తయారైంది.  సన్నగా మారింది సరే.. అందంపై పెద్దగా దృష్టిపెట్టలేదు అనుకుంటా.. పేస్ లో వయసు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.