ఇలియానా కొత్త అవతారం.. ఇలా ఉంటుందా? 

ఇలియానా కొత్త అవతారం.. ఇలా ఉంటుందా? 

ఇలియానా దేవదాస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా మంచి విజయం సాధించింది.  సినిమా సూపర్ హిట్ కావడంతో ఇలియానాకు అవకాశాలు వరసగా వచ్చిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, గత కొంతకాలంగా ఇలియానా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోతున్నాయి.  

ఇప్పుడు ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలు లేవు.  అయితే, ఇటీవలే ఇలియానా ది లవ్ లాఫ్ లైఫ్ షోలో పాల్గొన్నది.  ఈ కార్యక్రమంలో అనేక విషయాలను గురించి పంచుకుంది.  కాగా, సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అని అడిగితె, సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని, సక్సెస్ అయినట్టు చెప్పింది.  ఒకవేళ సినిమాల్లోకి రాకుండా ఉంటె..సింగర్ అయ్యేదాన్ని అని చెప్పింది.  సో, సినిమాల్లో హీరోయిన్ గా ఇప్పుడు ఎలాగో అవకాశాలు రావడం లేదు కాబట్టి.. ఇలియానా సింగర్ గా కొత్త అవతారం ఎత్తుతుందేమో చూడాలి.