ఇలియానాకి నచ్చినవి ఆ రెండేనట..!!

ఇలియానాకి నచ్చినవి ఆ రెండేనట..!!

దేవదాసు చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా, ఆ తరువాత తెలుగులో జల్సా, కిక్, పోకిరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది.  గత ఎనిమిది సంవత్సరాల క్రితం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే స్థిరపడింది.  బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఇలియానా ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తిరిగి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుగుతున్నది.  

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ తో ప్రేమలో పడింది.  వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.  ఇదిలా ఉంచితే, ఇలియానా సోషల్ మీడియాలో కాసేపు అభిమానులతో చిట్ చాట్ చేశారు.  ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.  

ఎనిమిదేళ్ళ తరువాత టాలీవుడ్ లో తిరిగి నటిస్తున్నందుకు కొంత బిడియంగా ఉందని చెప్పిన ఇలియానా, తనకు కిక్, జల్సా సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పింది.  అప్పట్లో ఆల్ టైమ్ హిట్ గా రికార్డులు సృష్టించిన పోకిరి విషయాన్ని ఇలియానా మర్చిపోయినట్టుంది.  ఎదురుగా ఉన్న వ్యక్తుల్లో మొదట వారి కళ్ళను చూస్తానని, మనిషిని ఆకర్షించేవి కళ్ళే చెప్పింది ఇలియానా, బాలీవుడ్, టాలీవుడ్ రెండు అంటే ఇష్టమే అని చెప్పిన ఈ గోవా బ్యూటీ మరి ఎనిమిదేళ్లు ఎందుకు దూరంగా ఉన్నదో చెప్పకపోవడం విశేషం.  

ఆండ్రూ నీబోన్‌ ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నానని, అతనితోనే జీవితం ఉంటుందని చెప్పింది.  ప్రేమకు హద్దులు ఉండవని.. ఏ దేశానికి చెందిన వ్యక్తులతోనైనా ప్రేమలో పడొచ్చని.. చెప్పింది.  జీవితానికి సరిపడే డబ్బు సంపాదించిన ఇలియానా ఇప్పుడు ప్రేమే ముఖ్యమని చెప్తున్నది.  ఆండ్రూ నీబోన్‌ టోన్ జీవితాన్ని పంచుకుంటానని అంటున్న ఈ బ్యూటీ పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా దాటేసింది.