అత్త‌తో ఎఫైర్‌.. కూతురుతో పెళ్లి.. ఇక‌. అడ్డులేకుండా పోయింది..!

అత్త‌తో ఎఫైర్‌.. కూతురుతో పెళ్లి.. ఇక‌. అడ్డులేకుండా పోయింది..!

ఆమెకు వివాహం జ‌రిగింది.. పెళ్లికి ఎదిగిన కూతురు కూడా ఉంది.. కానీ, ఆమె మ‌న‌సు ఓ యువ‌కుడిపై ప‌డింది.. భ‌ర్త కూడా ఉద్యోగ‌రీత్యా కుటుంబానికి దూరంగా ఉండ‌డంతో.. ఇక‌, వారి రాస‌లీల‌ల‌కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఎంత‌లా అంటే.. ఆ యువ‌కుడిని విడిచి ఉండ‌లేనంత‌గా ప‌రిస్థితి మారిపోయింది.. జీవితాంతం ఇదే సుఖం కావాల‌ని అనుకుందేమో.. స్కెచ్ వేసి త‌న కూతురు జీవితాన్ని బ‌లి చేసింది. ఆమె ప్లాన్‌లో భాగంగా.. ఆ యువ‌కుడితో.. కూతురు పెళ్లి చేసింది.. ఇంట్లో పెట్టుకుని ఎంజాయ్ చేసింది.. చివ‌ర‌కు ఏమైంది అంటే..?

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని బిలాస్‌పూర్‌లో.. దాదాపు 40 ఏళ్ల వ‌య‌సున్న‌ సోనం అనే ఆంటీకి.. 24 ఏళ్ల విక్రం అనే యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.. అదికాస్త మ‌రింత క్లోజ్‌గా మారి.. వివాహేత‌ర సంబంధానికి దారితీసింది.. ఇక‌, భర్త ఉద్యోగరీత్యా.. త‌న కుటుంబానికి దూరంగా కోల్‌క‌తాలో ప‌నిచేస్తుండ‌డంతో.. వీరి ఎంజాయ్‌కి అడ్డులేకుండా పోయింది.. మ‌రోవైపు.. పెళ్లికి ఎదిగిన కూతురు కూడా ఆమెకు ఉంది.. ఎప్ప‌టికీ త‌న ఎఫైర్ ఇలా కొన‌సాగించాల‌ని ప్లాన్ చేసి.. ఆ యువ‌కుడిని త‌న కూతురును ఇచ్చి పెళ్లి చేసింది.. ఇక‌, వారితో త‌న ఇంట్లోనే కాపురం పెట్టించింది. కూతురుకు తెలియ‌కుండా.. కొంత‌కాలం గుట్టుగా వ్య‌వ‌హారం బాగానే న‌డిచింది.. కానీ, సాటుమాటు వ్య‌వ‌హారాలు ఎక్కువ‌కాలం దాగ‌వు క‌దా..?  కొన్ని రోజుల త‌ర్వాత అనుమానం వ‌చ్చిన కూతురు.. ఆరా తీస్తే.. త‌న త‌ల్లి, భ‌ర్త అక్ర‌మ‌సంబంధం గుట్టు తెలిసింది.. ఆ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోయిన కూతురు.. త‌న త‌ల్లి ద‌గ్గ‌ర నుంచి వెళ్లిపోదామ‌ని బెట్టు చేసింది.. దానికి అంగీక‌రించ‌లేదు భ‌ర్త‌.. అంతేకాదు.. త‌న ప్రేయ‌సి అయిన అత్త‌తో క‌లిసి.. భార్య‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేయ‌డం మొద‌లుపెట్టాడు.. కొంత‌కాలం మౌనంగా భ‌రించిన యువ‌తి.. చివ‌ర‌కు ఆ విష‌యాన్ని త‌న తండ్రికి చెప్పింది.. తండ్రి, బంధువులు.. కూతురు అంతా క‌లిసి.. ఆ ఇద్ద‌రినీ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని దేహ‌శుద్ధిచేశారు.. ఇష్టం వ‌చ్చిన‌ట్టు కొట్టారు.. చివ‌ర‌కు పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు.