బెజవాడలో 20 కిలోల అక్రమ బంగారం...కొరియర్ ద్వారా ?

బెజవాడలో 20 కిలోల అక్రమ బంగారం...కొరియర్ ద్వారా ?

బెజవాడలో భారీగా బంగారం పట్టుబడింది.. ముంబై నుంచి కార్గో కొరియర్ ద్వారా గన్నవరం విమానాశ్రయం తీసుకువచ్చిన 20 కిలోల బంగారు ఆభరణాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జీఎస్టీ, ఇతర పన్నులు ఎగవేసి నగరంలోని బంగారు దుకాణాలకు ఈ ఆభరణాలను సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. జీఎస్టీ అధికారుల సమక్షంలో కేసును టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం విచారించనుంది. 

పట్టుబడ్డ బంగారం విలువ 17 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం స్మగ్లింగ్‌ విజయవాడకు కొత్త కాదు. ఒకప్పుడు బస్సులు, రైళ్ల ద్వారా బిల్లులు లేని బంగారం తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఏకంగా విమానాలతో రవాణా చేస్తున్నారు. కొరియర్‌ సంస్థలే ముంబయిలో సరకు లోడ్‌ చేసి ఆ తరువాత ఇక్కడ తీసుకుని వ్యాపారులకు అప్పగిస్తుంటాయి. బిల్లులు లేకుండా గమ్యానికి చేరితే లక్షల్లో లాభం ఉండటంతో కొందరు వ్యాపారులు ఈ జీరో బిజినెస్‌ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.