నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు..పార్క్ హయత్ కేసులో ట్విస్ట్ !

నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు..పార్క్ హయత్ కేసులో ట్విస్ట్ !

పార్క్ హయత్ హోటల్లో పార్టీ చేసుకున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వారంతా యువకులే అనుకుంటే అది తప్పని తేలింది. పార్టీ పేరుతొ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి రచ్చ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులు పార్టీ చేసుకుంటున్నట్లు, నానా హంగామా చేస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అలా దాడి చేసి నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేసులు నమోదు చేశారు. 

ఇక ఇందులో డాట్ పబ్ యజమాని సంతోష్ రెడ్డి సూత్రధారని తేలింది. గతంలో పబ్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిన సంతోష్ రెడ్డి అయినా పద్దతి మార్చుకోలేదు. సంతోష్ రెడ్డి ఈ పార్టీని కూడా ఆర్గనైజ్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సంతోష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ పార్టీలో ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగాయా... అన్న కోణంలో కూడా విచారణ ప్రారంభించారు.