నేను పాక్ జట్టుకి తల్లిని కాదు

నేను పాక్ జట్టుకి తల్లిని కాదు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ నటి వీణా మాలిక్ మధ్య ట్విట్టర్ లో యుద్ధం జరుగుతోంది. శనివారం రాత్రి తన భర్త, పాకిస్థానీ ఆటగాడు షోయబ్ మాలిక్ తో సానియా ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కి వెళ్లిన ఒక వీడియో భారత్-పాకిస్థాన్  మ్యాచ్ తర్వాత వైరల్ గా మారింది. తర్వాత రోజు భారత్ తో మ్యాచ్ ఉండగా షోయబ్, సానియా డిన్నర్ కి వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. షోయబ్ మాలిక్ కి తన ఫిట్ నెస్ పట్ల అసలు శ్రద్ధే లేదని విమర్శలు వస్తున్నాయి. జంక్ ఫుడ్ ఉండే రెస్టారెంట్ కు సానియా భర్త, పిల్లాడితో కలిసి వెళ్లడాన్ని వీణా మాలిక్ తీవ్రంగా ఖండించింది. దీనిపై సానియా కూడా గట్టిగా జవాబు ఇస్తుండటంతో సోషల్ మీడియాలో వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న ట్వీట్ల సంగ్రామం వైరల్ గా మారుతోంది.
Click link to see the tweet: https://twitter.com/iVeenaKhan/status/1140662185955332096
వీణా మాలిక్ తన ట్వీట్ లో 'సానియా, నిజానికి నేను మీ బాబు గురించి ఆందోళన చెందుతున్నాను. మీరిద్దరూ మీ పిల్లాడితో కలిసి షీషా ప్యాలెస్ వెళ్లారు. ఇది ప్రమాదకరం కాదా? నాకు తెలిసినంత వరకు ఆర్చీ జంక్ ఫుడ్ కి గుర్తింపు పొందింది. ఇది ఏ అథ్లెట్, పిల్లాడికీ మంచిది కాదు. నువ్వు స్వయంగా ఒక అథ్లెట్ వి. తల్లివి కూడా. నీకు ఇంత మాత్రం కూడా తెలియదా?' అని రాసింది. ఈ విధంగా వీణా మాలిక్ సానియా మీర్జాపై విమర్శలు ఎక్కుపెట్టింది. దీనికి జవాబుగా సానియా మీర్జా కూడా గట్టిగా జవాబిస్తూ ట్వీట్ చేసింది.
Click link to see the tweet: https://twitter.com/MirzaSania/status/1140706898280361988
సానియా మీర్జా తన ట్వీట్ లో 'వీణా, నేను నా కొడుకుని షీషా ప్యాలెస్ కి తీసుకెళ్లలేదు. మీకు కానీ, మిగతా ప్రపంచానికి కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేను నా బిడ్డని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. మరో విషయం ఏంటంటే నేనేం పాకిస్థానీ క్రికెట్ టీమ్ డైటీషియన్ ని కాదు, తల్లిని కాదు, ప్రిన్సిపాల్ లేదా టీచర్ ని కాను' అని గట్టిగా పంచ్ లు వేసింది.

ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ ను 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో భారత జట్టు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఓడిపోని తన రికార్డును పదిలంగా నిలుపుకొంది. భారత్ చేతిలో ఘోర పరాజయంతో పాకిస్థాన్ లో విమర్శల పెను దుమారం రేగుతోంది. పాక్ జట్టు క్రికెటర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Click link to see the tweet: https://twitter.com/me_shihzadi/status/1140316015009705985