కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు ఆగ్నేయంగా 850 కిమీ, చెన్నైకి ఆగ్నేయంగా 1180 కిమీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1460 కిమీ దూరంలో కేంద్రీకృతమైనట్లు ప్రకటించింది. తీవ్ర వాయుగుండం గంటకు 18 కిమీల వేగంతో తీరం వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. రాగల 6గంటల్లో తుఫాన్ గా మారనున్నట్లు తెలిపింది. ఈ తుఫాన్ కు ఫణి అని భారత వాతావరణ శాఖ నామకరణం చేయనుంది. ఆ తర్వాత మరో 12గంటల్లో తీవ్ర తుఫాన్ అనంతరం అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈనెల 30 సాయంత్రం ఉత్తర తమిళనాడు- దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.