అందులో రెండు మనవే..!!

అందులో రెండు మనవే..!!

సినిమా రిలీజ్ తరువాత ఎలాగైతే క్రిటిక్స్ రేటింగ్ ఇస్తారో.. అదే విధంగా సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందిన తరువాత సదరు సినిమాకు ఐఎండిబి రేటింగ్ ఇస్తుంది.  ఈ రేటింగ్ ను బట్టి సినిమా  పాపులారిటీ ఉంటుంది.  హాలీవుడ్ మొదలుకొని ప్రపంచంలోని చాలా సినిమాలు ఈ ఐఎండిబి రేటింగ్ కోసం ఎదురు చూస్తుంటారు.  రేటింగ్ ఎక్కువగా ఉంటె.. ఆ సినిమాను చూసేందుకు ఎక్కువగా నెటిజన్లు ఆసక్తి చూపుతుంటారు.  

ప్రతి సంవత్సరం టాప్ 10 లిస్ట్ ను రిలీజ్ చేస్తుంది ఐఎండిబి సంస్థ.  ఈ ఏడాది రిలీజ్ చేసిన టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్ లో రెండు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. టాప్ టెన్ లిస్ట్ లో కీర్తి సురేష్ నటించిన మహానటి 4 వ ప్లేస్ లో ఉంటె, రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన రంగస్థలం 7 వ స్థానంలో నిలిచింది.