నరేష్ గోయల్ దంపతులని విదేశాలకు వెళ్లనివ్వని అధికారులు

నరేష్ గోయల్ దంపతులని విదేశాలకు వెళ్లనివ్వని అధికారులు

జెట్ ఎయిర్ వేస్ మాజీ చైర్మన్, ఆయన భార్య విదేశాలకు వెళ్లకుండా ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు ముంబై ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. గోయల్, ఆయన భార్య ఇవాళ మధ్యాహ్నం 3.35 గంటలకు ముంబై ఎయిర్ పోర్టులో లండన్ వెళ్లే విమానం ఎక్కారు. విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విమానాన్ని వెనక్కి రప్పించింది. వాళ్లిద్దరూ విమానం దిగిన తర్వాత యథావిధిగా గమ్యస్థానానికి ప్రయాణమైంది. 

అత్యవసరంగా నిధులు విడుదల చేయాలన్న జెట్ ఎయిర్ వేస్ విజ్ఞప్తిని రుణదాతలు తిరస్కరించడంతో సంస్థ ఏప్రిల్ 17 నుంచి తన అన్ని విమానాల కార్యకలాపాలను నిలిపేసింది. దీంతో ఒకప్పుడు భారత్ లో అతిపెద్ద ప్రైవేట్ రంగ విమానయాన సంస్థగా పేరొందిన జెట్ ఎయిర్ వేస్ కథ ముగిసినట్టయింది. తలమునక అప్పుల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థ చౌకగా సేవలందిస్తూ మార్కెట్ విస్తరించుకున్న విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్ జెట్ లతో పోటీ పడలేకపోయింది. కొండలా పేరుకుపోయిన అప్పుల కారణంగా జెట్ ఎయిర్ వేస్ తన విమానాలను నేలకు దించాల్సి వచ్చింది.