కొత్త లుక్ తో కేక పుట్టిస్తున్న నారా రోహిత్ !

కొత్త లుక్ తో కేక పుట్టిస్తున్న నారా రోహిత్ !

గత కొన్నేళ్లుగా సాలిడ్ విజయం లేక ఇబ్బందిపడుతున్న హీరో నారా రోహిత్ రాబోయే రోజుల్లో మంచి విజయాల్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో వరుసగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు.  ఇప్పటికే 'ఆటగాళ్లు, వీరభోగ వసంత రాయలు' వంటి భిన్నమైన సినిమాలు చేస్తున్న ఆయన ఇంకో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. 

అదే 'అనగనగా దక్షిణాదిలో'.  1971 బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న ఈ సినిమాను 'బాణం' దర్శకుడు దంతులూరి చైతన్య డైరెక్ట్ చేయనున్నాడు.  నిన్ననే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభిస్తోంది.  వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.  ఈ చిత్రాన్ని నారా రోహిత్, శ్రీవిష్ణులు కలిస్ నిర్మించనున్నారు.  ఇది కాకుండా తెలుగు టాకీస్ అనే సంస్థతో జర్నలిజం బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయనున్నాడు రోహిత్.