సంచలంరేపుతున్న ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు

సంచలంరేపుతున్న ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 తరువాత ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  ఇప్పటికే పాకిస్తాన్ ఇండియాతో వాణిజ్యసంబంధాలు తెచ్చుకుంది.  దీంతోపాటు అంతర్జాతీయంగా ఇండియాను ఒంటరిని చేయాలని చూసింది.  చైనా అండతో భద్రతా మండలిలో కంప్లైంట్ చేసినా లాభంలేకపోయింది.  దీంతో ఇప్పుడు పాక్ ప్రధాని ఇప్పుడు ఇండియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి సిద్దమయ్యాడు.  

ఎన్ఆర్సి, అణ్వస్త్రవిధానంపై ఆయన కలుగజేసుకున్నాడు. భారత్ అణ్వస్త్ర భద్రతపై కూడా ఆయన కామెంట్స్ చేశారు.  మోదీ ప్రభుత్వం పాక్‌తో పాటు ప్రాంతీయంగా ముప్పు కలగజేస్తోందని, ఎన్ఆర్‌సీతో కొన్ని వర్గాలకు నష్టం కలిగే అవకాశం ఉందంటూ పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో కలుగజేసుకోవాలని, భారత్ ను అడ్డుకోవాలని కోరారు.  నిన్నటిరోజున భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పీవోకే గురించి చేసిన కీలక వ్యాఖ్యల తరువాత ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.