పాక్... చైనా కారిడార్ పై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు...
చైనా... పాక్ దేశాల మధ్య చైనా ఓ కారిడార్ ను నిర్మిస్తోంది. ఈ కారిడార్ పూర్తయితే ఆ రెండు దేశాల మధ్య వర్తకం రోడ్డు మార్గంలో జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం చైనా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా పీవోకే విషయంలో ఇండియా గట్టి పట్టుబడుతున్నది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని ఇండియా రద్దు చేసింది. దీంతోపాటుగా జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిడంతో పాక్ షాక్ అయ్యింది.
పాకిస్తాన్ అక్రంగా ఆక్రమించుకున్న పీవోకేను ఎట్టిపరిస్థితుల్లో సొంతం చేసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో చైనా, పాక్ కారిడార్ ఏర్పాటుపై సమస్యలు ఏర్పడ్డాయి. ఈ కారిడార్ పీవోకే మీదుగా వెళ్తుంది. వివాదాస్పదంగా ఉన్న పీవోకేను ఇండియా తిరిగి స్వాధీనం చేసుకుంటే ఆ కారిడార్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. పైగా ఇప్పుడు ఇండియా చైనా మధ్య కూడా పోరు జరుగుతున్నది. బోర్డర్ లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో ఈ కారిడార్ గురించి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేస్తామని అన్నారు. దానికోసం ఎంత ఖర్చు అయినా సరే భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ కారిడార్ ఏర్పడితే పాక్ అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని, దాని ఫలాలు ప్రతి పాకిస్తానీకి అందుతాయని అన్నారు ఇమ్రాన్ ఖాన్.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)