వరల్డ్‌కప్‌ చరిత్రలో తాహిర్‌ సరికొత్త రికార్డు

వరల్డ్‌కప్‌ చరిత్రలో తాహిర్‌ సరికొత్త రికార్డు

సౌతాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్‌లో మొదటి ఓవర్‌ వేసిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇవాళ ప్రారంభమైన వరల్డ్‌కప్‌ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాలు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన సఫారీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఎక్స్‌ప్రెస్‌ ఫాస్ట్‌ బౌలర్లున్నప్పటికీ డుప్లెసిస్‌ అనూహ్యంగా ఇమ్రాన్‌ తాహిర్‌తో మొదటి ఓవర్‌ను వేయించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము చేయని తాహిర్‌.. తన రెండో బంతికే బెయిర్‌ స్టోను పెవిలియన్‌కు పంపించాడు.

గత వరల్డ్‌కప్‌లను పరిశీలిస్తే.. 1975లో మదన్‌లాల్‌, 1979లో ఆండీ రాబర్ట్స్, 1983లో రిచర్డ్‌ హ్యాడ్లీ, 1987లో వినోథన్‌ జాన్‌, 1992లో క్రెయిగ్‌ మెక్‌డెర్మట్‌, 1996లో డొమెనిక్‌ కార్క్‌, 1999లో డారెన్‌ గాఫ్‌, 2003లో షాన్‌ పొలాక్‌, 2007లో ఉమర్‌ గుల్‌, 2011లో షఫీఉల్‌ ఇస్లామ్‌, 2015లో నువాన్‌ కులశేఖరలు మొదటి ఓవర్‌ వేశారు.