‘స్కౌట్‌ మాస్టర్‌-2019’ క్రీడా పోటీలకు భారత్ ఆతిథ్యం

‘స్కౌట్‌ మాస్టర్‌-2019’ క్రీడా పోటీలకు భారత్ ఆతిథ్యం

అంతర్జాతీయ రక్షణ దళాల ‘స్కౌట్‌ మాస్టర్‌-2019’ పోటీలకు భారత్ వేదిక కానుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జులై 24 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్న ఈ పోటీలను భారత రక్షణ దళాలకు చెందిన కోణార్క్‌ కాప్స్‌ నిర్వహిస్తున్నాయి. రష్యా, చైనా, కజకిస్థాన్‌, ఆర్మేనియా, జింబాబ్వే దేశాలకు చెందిన రక్షణ దళాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీల్లో పదాతి దళాల యుద్ధ వాహనాలు, మానవ రహిత యుద్ధ విమానాల విన్యాసాలు ప్రముఖంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. తొలిసారి ఆతిథ్య భారత్‌ కూడా వీటిలో పాల్గొంటోంది.