ఇలాంటి పెళ్లి రిజిస్టర్ కావడం ఇదే మొదటిసారి!

ఇలాంటి పెళ్లి రిజిస్టర్ కావడం ఇదే మొదటిసారి!

దేశంలో మొట్టమొదటిసారి ఒక పురుషుడు, ఒక లింగమార్పిడి మహిళ పెళ్లి రిజిస్టర్ అయింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ ఈ చారిత్రక ఘటనకు వేదికైంది. బి. అరుణ్ కుమార్(22) అక్టోబర్ 2018లో అరుల్మిఘు శంగర రామేశ్వర దేవాలయంలో పి.శ్రీజ(20)ని హిందూ సంప్రదాయాలను అనుసరించి పెళ్లాడాడు. వీరి వివాహాన్ని రిజిస్ట్ చేసేందుకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నిరాకరించింది. దీంతో వీళ్లు మద్రాస్ హైకోర్ట్ మదురై బెంచ్ లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఏప్రిల్ 22న మదురై బెంచ్ వీరి కళ్యాణాన్ని నమోదు చేయాల్సిందిగా జిల్లా రిజిస్ట్రార్ ను ఆదేశించింది. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయం వీళ్లిద్దరికీ మే 20(సోమవారం)న మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసింది. పెళ్లికొడుకు అరుణ్ భారతీయ రైల్వేలలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తుండగా శ్రీజ తూత్తుకుడిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ ఇంగ్లీష్ రెండో సంవత్సరం చదువుతోంది.