మాస్టర్స్ విజయంపై టైగర్ ఉడ్స్ పై అభినందనల వెల్లువ

మాస్టర్స్ విజయంపై టైగర్ ఉడ్స్ పై అభినందనల వెల్లువ

అమెరికన్ గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ ఉడ్స్ పై అభినందనల వెల్లువ కురుస్తోంది. ఉడ్స్ కి 11 ఏళ్ల మేజర్ టైటిల్ కరువు తీరుస్తూ ఆదివారం ఆగస్టాలో మాస్టర్స్ విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసల జట్లు కురిపించారు.

ఫ్రాన్సెస్కో మొలినారీ కంటే రెండు షాట్లు వెనుకబడి ఆట ప్రారంభించిన టైగర్, ఫైనల్ రౌండ్ లో విజృంభించాడు. డస్టిన్ జాన్సన్, జాండర్ షౌఫెల్, బ్రూక్స్ కోప్కాలపై ఒక షాట్ తేడాతో విజయం సాధించాడు. 

ఒక షార్ట్ బోగీ పుట్ తో విన్నింగ్ షాట్ కొట్టగానే తన క్లబ్, పిడికిలిని ఆకాశం వైపు ఎత్తి తన తల్లిని, పిల్లలను గట్టిగా హత్తుకున్నాడు. హోల్ లో బంతి పడగానే ప్రేక్షకులంతా 'టైగర్, టైగర్, టైగర్' అని అరవడం ప్రారంభించారు.

'కంగ్రాచులేషన్స్ టైగర్ వుడ్స్' అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ఏడాదే ట్రంప్ మాజీ ఛాంపియన్ తో ఒక రౌండ్ గోల్ఫ్ ఆడారు. 'నిజమైన ఛాంపియన్' అని రాశారు.
 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా 'కంగ్రాచులేషన్స్ టైగర్' అని తన ట్వీట్ లో రాశారు. 'జీవితంలో అనేక ఎత్తులు, పల్లాలు చూసి తిరిగి వచ్చి మాస్టర్స్ గెలవడమంటే నీ అద్భుత ప్రతిభ, పట్టుదల, దృఢ సంకల్పాన్ని రుజువు చేస్తుంది' అని పేర్కొన్నారు.

'టైగర్ ఉడ్స్ విజయం సాధించడాన్ని చూసి నేను నిజంగా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది ఎవరికీ సాధ్యం కానీ గొప్పదనం' అని 23 సార్లు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ ట్వీట్ చేసింది. 'మీరు శారీరకంగా ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు. అలాంటి స్థితి నుంచి తిరిగి వచ్చి ఇవాళ మీరు సాధించినది మామూలు విషయమా? మిలియన్ సార్లు కంగ్రాట్స్. నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తున్నందుకు థాంక్యూ' అని రాసింది.

'మాస్టర్స్ గెలిచినందుకు టైగర్ వుడ్స్ కి అభినందనలు' అని ఎన్బీఏ ఐకాన్ మ్యాజిక్ జాన్సన్ ట్వీట్ చేశాడు. 'పులి తిరిగి గర్జిస్తోంది' అని రాశాడు.