పటాకులకు బదులు... 

పటాకులకు బదులు... 

దీపావళి వేళ టపాకాయలు కాల్చడం సాధారణం. అయితే వ్యక్తిగత ఆనందం కన్నా ఆశ్రితులకు ఏదైనా సాయం చేయడమే మేలనుకున్న కొందరు సామాజిక శ్రేయోభిలాషులు.. ఢిల్లీలోని రోడ్ల మీద తిరుగుతూ ఫుట్ పాత్ ల మీద పడుకున్నవారి మీద దుప్పట్లు పంచుతూ ముందుకు సాగిపోయారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలి పూట.. కాసింత వెచ్చదనం పంచే దుప్పటికన్నా  మేలు ఏముంటుంది? అందుకే ఆ వీడియో ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది.