తల్లి స్మృతిలో 75 వేల లైబ్రరీలు

తల్లి స్మృతిలో 75 వేల లైబ్రరీలు

సొంత ఖర్చుతో ఒక్క లైబ్రరీ ఏర్పాటు చేయడమే గగనం. అలాంటిది అమెరికాలోని ఓ ఆసామి 75 వేల లైబ్రరీల్ని ఏర్పాటు చేశాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. టాడ్ బోల్ అనే వ్యక్తి ఆయన తల్లి జ్ఞాపకార్థం లిటిల్ ఫ్రీ లైబ్రరీస్ ను ఏర్పాటు చేశాడు. చిన్న పోస్టుబాక్స్ లాంటి డబ్బాలో తల్లికి సంబంధించిన పుస్తకాలు కమ్యూనిటీ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాడు. ఆయన తల్లి ఓ స్కూలు టీచర్. ఆమెకు పుస్తకాలంటే ప్రాణం. ఆమె సేకరించిన పుస్తకాలను, వాటిలోని విజ్ఞానాన్ని పదిమందికీ పంచాలన్న ఉద్దేశంతో టాడ్ బోల్ ఇలా లిటిల్ ఫ్రీ లైబ్రరీలకు అంకురార్పణ చేశాడు. ఈ తొమ్మిదేళ్లలో వాటి సంఖ్య 75 వేలకు పెరిగింది. అమెరికాలోనే గాక 88 దేశాల్లో ఇలాంటి స్మాల్ లైబ్రరీస్ పాపులర్ గా మారాయి. 

నచ్చిన పుస్తకం తీసుకోవచ్చు. మీ దగ్గరున్నదాన్ని అందులో పెట్టవచ్చు. నెలవారీ రెంటల్ చార్జీలు లేవు. ఎప్పుడు రిటర్న్ చేస్తారని అడిగేవారు ఉండరు. ఇలా ఎన్నో సదుపాయాలు ఉండడంతో ఈ లైబ్రరీలు పాపులర్ అయ్యాయి.