అమెరికాలో ఆగని కరోనా కేసులు... ఆ దేవుడే కాపాడాలి....!!

అమెరికాలో ఆగని కరోనా కేసులు... ఆ దేవుడే కాపాడాలి....!!

అమెరికాలో కరోనా కేసులు ఆగడం లేదు.  రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  వెయ్యి రెండు వేలు కాదు.  రోజుకు మినిమం పదివేలకు పైగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  కరోనా వైరస్ ను రాజకీయంగా మొదట్లో కొట్టేసి లైట్ గా తీసుకోవడంతో ఇప్పుడు అమెరికాకు మించిన భారమై కూర్చున్నది.  మూడో స్టేజ్ వరకు పెద్దగా పట్టించుకొకపోవడం, పదేపదే చైనాపై నిందలు వేస్తూ సమయం వృధా చేయడంతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  కేవలం పది రోజుల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.   ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.  అక్కడ కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో.  చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది.  అమెరికా ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.  

అమెరికాలోని 50 రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాపించింది.  అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలను లాక్ డౌన్ చేశారు తప్పించి అమెరికా మొత్తం లాక్ డౌన్ చేయలేదు.  విమానాలు తిరుగుతూనే ఉన్నాయి.  పరిశ్రమలు నడుస్తున్నాయి.  కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూ జెర్సీ, క్యాలిఫోర్నియా, ఫ్లోరిడా, వాషింగ్టన్ వంటి రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.    ఇప్పటి వరకు అక్కడ 1, 12, 560 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఈ సమయంలో అమెరికాను ఆ దేవుడే కాపాడాలి.