పింక్‌ బాల్‌ టెస్ట్‌లో బొక్కబోర్లా పడ్డ బంగ్లాదేశ్‌

పింక్‌ బాల్‌ టెస్ట్‌లో బొక్కబోర్లా పడ్డ బంగ్లాదేశ్‌

పింక్ బాల్ టెస్ట్‌లో బంగ్లా బొక్క బోర్లా పడింది. ఇండియన్ ఫేస్ విభాగాన్ని తట్టుకోలేక.. 106 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా ఆరంభం నుంచే భారీ షాక్‌లు తగులుతూ వచ్చాయి. బంగ్లా టాప్ ఆర్డర్ వరుస కట్టి పెవిలియన్ చేరారు. 50 పరుగుల లోపే ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు చేరారు. మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ మిథున్ ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్‌గా వెనుతిరిగారు. కేవలం 3 బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే రెండకెల స్కోరును దాటగలిగారు. దీంతో 106 పరుగులకే బంగ్లా కుప్పకూలింది. భారత్ పేసర్లు ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, షమీ నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా నడ్డి విరిచారు. 5 వికెట్లతో ఇషాంత్ చెలరేగాడు. ఉమేష్‌ 3 వికెట్లతో మెరవగా.. షమీకి రెండు వికెట్లు దక్కాయి.