మొతేరా పిచ్‌పై ఎవరి లెక్కలు వారివే..!

మొతేరా పిచ్‌పై ఎవరి లెక్కలు వారివే..!

ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న డే అండ్ నైడ్ టెస్ట్ కోసం.. ఇంగ్లండ్, టీమిండియా పూర్తిస్థాయిలో కసరత్తు చేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టు సాధించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. వరల్డ్‌ బిగ్గెస్ట్‌ క్రికెట్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. పింక్‌బాల్‌ టెస్ట్‌పై రెండు జట్లు ధీమా వ్యక్తం చేస్తున్నాయ్‌..!

చెన్నై చెపాక్‌లో భారత్, ఇంగ్లండ్ చెరో టెస్టు గెల్చి సిరీస్ సమం చేశాయి. దీంతో మొతేరా టెస్టు ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ టెస్టులో గెల్చి ఆధిక్యత సాధించేందుకు.. ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అంతేకాదు.. టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరాలన్నా.. రెండు జట్లకు ఇది కీలక మ్యాచ్‌..! అందుకే విజయం కోసం నెట్స్‌లో శ్రమించాయి. 

ఇక టెస్ట్‌కు మరో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం మొతేరాలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. సకల సౌకర్యాలు ఉన్న మొతేరాలో పింక్‌బాల్‌ టెస్ట్‌ మ్యాచ్‌పై ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో ఈ మ్యాచ్ జరగనుంది. డై అండ్‌ నైట్‌ మ్యాచ్‌కి అంతా సిద్ధమైంది. మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యాచ్‌ సాగుతుంది. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో బ్యాట్‌మెన్‌ గుర్తించేందుకు వీలుగా ఉండేందుకు పింక్‌బాల్‌తో ఆడుతున్నారు. 

పింక్‌బాల్‌ టెస్ట్‌పై రెండు జట్లు లెక్కలేసుకుంటున్నాయ్‌. ఈ టెస్ట్‌ తమకు అనుకూలిస్తుందని ఇంగ్లండ్‌ భావిస్తే.. కాదని తమకే అడ్వాంటేజ్‌ అని టీమిండియా లెక్కలేసుకుంటోంది. మొతేరా పిచ్‌.. ఇంగ్లండ్‌ పిచ్‌లకు దగ్గరగా ఉంటుందని.. పేస్‌ అటాక్‌తో సత్తా చాటాలని ఇంగ్లండ్‌ ప్లేయర్లు భావిస్తున్నారు. నిజానికి పింక్‌బాల్‌.. రెడ్‌బాల్‌ కంటే ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. ఇది సీమర్లకు అడ్వాంటేజ్‌గా మారనుంది. అయితే ఇంగ్లండ్‌కి ధీటుగా అటు భారత్‌ కూడా సీమర్లను రంగంలోకి దించే అవకాశం ఉంది. ఇషాంత్‌, సిరాజ్‌తో పాటు బూమ్రను తిరిగొచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఫిట్‌నెస్‌ను బట్టి ఉమేశ్‌ యాదవ్‌కి ఛాన్స్‌ దక్కొచ్చు. భారత్‌ ఫేస్‌ త్రయం దుమ్మురేపుతుందని భావిస్తున్నారు. అయితే ఇంగ్లండ్‌ ఫేస్‌ అటాక్‌ను సమర్ధంగా తిప్పికొట్టే సామర్థ్యం టీమిండియాకు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి ఆస్ట్రేలియా టూర్‌ను ఉదాహారణగా చెబుతున్నారు. 

మొతేరా పిచ్‌పై ఎవరు ఎన్ని లెక్కలు వేసుకుంటున్నా.. అది ఎలా ఉంటుందన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే పునరుద్ధరణ తర్వాత ఆడుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడంతో.. భారీగా అంచనాలు ఉన్నాయి. స్పిన్‌కు అనుకూలించే ఛాన్స్‌లు ఉన్నాయని చెబుతున్నారు. పింక్‌బాల్‌ టెస్ట్‌లో సీమర్లదే ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లలో టాస్‌ కీలకంగా మారనుంది.

మ్యాచ్‌కి ముందు.. మొతేరా అందాలు ఆకట్టుకుంటున్నాయ్‌. పునరుద్ధరణ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా మారింది. ఇప్పటికే క్రికెటర్లు వీడియోలతో స్టేడియంలోని సౌకర్యాలను చూపిస్తున్నారు. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ డ్రోన్‌ కెమెరాతో సందడి చేశాడు.  డ్రోన్‌ కెమెరాతో ట్రైనింగ్‌ సెషన్‌ను వీడియో తీశాడు.