రెండో రోజు ముగిసిన ఆట... ఆధిక్యంలోకి కివీస్...

రెండో రోజు ముగిసిన ఆట... ఆధిక్యంలోకి కివీస్...

భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు కూడా ముగిసిపోయింది. అయితే బ్యాటింగ్ లో తేలిపోయిన భారత్ బౌలింగ్ లో కూడా తేలిపోయింది . మొదటి ఇన్నింగ్స్ లో 165 పరుగులకే ఆలౌట్ అయ్యి బ్యాటింగ్ లో తేలిపోయిన భారత్ బౌలింగ్ లోను సత్తా చూపించలేక పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు 51 పరుగుల ఆధిక్యం లోకి వెళ్ళింది. కివీస్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ (89) పరుగులు చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒక్కడే 3  వికెట్లు తీసి  కివీస్ ని కంగారు పెట్టాడు. ఇక షమీ, అశ్విన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. టేలర్ కూడా 44 పరుగులతో రాణించాడు. అయితే పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్ భారత్ చేజారేల ఉంది.