మూడో రోజు ముగిసిన ఆట... 39 పరుగులు వెనుకబడిన భారత్..

మూడో రోజు ముగిసిన ఆట... 39 పరుగులు వెనుకబడిన భారత్..

భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ముచ్చటగా మూడో రోజు ముగిసిపోయింది అయిన కూడా భారత్ ఆట తీరు ఏం మారలేదు. మొదటి ఇన్నింగ్స్ లో 165 పరుగులు చేసిన భారత్ మీద కివీస్ 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో భారత పేసర్ ఇషాంత్ శర్మ 5 వికెట్లు తీసి మరో సారి 5 వికెట్ల క్లబ్ లో చేరిపోయాడు. టెస్ట్ లో ఇలా 5 వికెట్లు తీయడం ఇషాంత్ కు ఇది 11 సారి. అయితే కివీస్ ని 348 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన భారత్ తన రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అయితే యువ ఓపెనర్ పృథ్వీ షా(14) పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ మయాంక్(58) హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు కానీ తరువాత క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. తరువాత వచ్చిన పుజారా (11), కోహ్లీ(19) మళ్ళీ నిరాశే మిగిల్చారు. తరువాత రహానే(25), విహారి(15) తో నాటౌట్ గా నిలిచారు. మూడో రోజు ముగిసే సమయానికి భారత్ 144 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లు ట్రెంట్ బోల్ట్ 3, సౌథీ ఒక వికెట్ తీసుకున్నారు.