ఫ్యాన్ కాళ్లు మొక్కితే ధోనీ ఏం చేశాడంటే..

ఫ్యాన్ కాళ్లు మొక్కితే ధోనీ ఏం చేశాడంటే..

న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ని భారత్ 2-1తో ఓడిపోయింది. హ్యామిల్టన్ సెడాన్ పార్క్ లో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో కివీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించారు. చివరలో దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్యా విజృంభించినా భారత్ 213 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

చేతిలో భారత జాతీయ పతాకం పట్టుకున్న ఓ ఫ్యాన్ సెక్యూరిటీ వలయాన్ని దాటుకొని పరిగెడుతూ వచ్చి ఎంఎస్ ధోనీ కాళ్లకు మొక్కాడు. జెండాను పక్కనపెట్టి తన చొక్కా అంచుతో ధోనీ బూట్లు తుడిచాడు. త్రివర్ణ పతాకం తన కాళ్లకు తాకుతోందని గుర్తించిన ధోనీ వెంటనే మువ్వన్నెల జెండాను చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో ఆ ఫ్యాన్ తన వెంట పడుతున్న సెక్యూరిటీ గార్డులకు దొరక్కుండా పరుగు పెట్టాడు. ఎంఎస్ సమయస్ఫూర్తి, జాతీయ పతాకానికి ఇచ్చిన గౌరవం చూసినవారంతా ఇందుకే మిస్టర్ కూల్ ని ప్రపంచవ్యాప్తంగా అభిమానిస్తారు, గౌరవిస్తారని అంటున్నారు.

ఈ సంగతి ఇలా ఉంటే వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ తన ట్రేడ్ మార్క్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమయ్యాడు. ఎన్నోసార్లు జట్టుని విజయతీరాలకు చేర్చిన 37 ఏళ్ల ధోనీ కేవలం రెండు పరుగులకే ఔటయ్యాడు.