రేపే రెండో టెస్ట్... మనోళ్లు ఏం చేస్తారో..!!

రేపే రెండో టెస్ట్... మనోళ్లు ఏం చేస్తారో..!!

భారత్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. అయితే జరిగిన మొదటి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది భారత్. రెండు ఇన్నింగ్స్ లో 165 , 191 పరుగులు మాత్రమే చేసింది. ఈ రెండు ఇన్నింగ్స్ లో కేవలం ఒక మయాంక్ అగర్వాల్(58) మాత్రమే ఒక హాఫ్ సెంచరీ చేసాడు అంతే. అలాగే రహానే(46) పరుగులు తప్ప మిగితా వారు అందరూ విఫలం చెందారు. బౌలర్లలో కూడా ఇషాంత్ శర్మ ఒకడే రాణించాడు. మిగితా భారత బౌలర్లు అందరూ కివీస్ బ్యాట్స్మెన్స్ ముందు తల వంచారు. అయితే రేపు భారత్-న్యూజిలాండ్ ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే కనీసం ఈ టెస్ట్ లోనైనా గెలిచి ఈ సిరీస్ ను డ్రా చేసుకొని పరువు కాపాడుకోవాలని చూస్తుంది భారత్. అయితే కివీస్ మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి స్థానం లో ఉన్న భారత్ పై గెలిచి టెస్ట్ లో రెండో స్థానం లోకి రావాలని చూస్తుంది.  అయితే సొంత గడ్డ పై బలంగా ఉన్న కివీస్ ని ఓడించాలంటే భారత్ చాల కష్ట పడాల్సి వస్తుంది. అయితే మొదటి టెస్ట్ లో నిరాశ పరిచిన భారత బ్యాట్స్మెన్స్ కోహ్లీ, పుజారా, రహానే వీరిలో ఏ ఒకరు తిరిగి ఫామ్ లోకి వచ్చిన కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాదు స్కోర్ బోర్డు ను కూడా పరుగులు పెట్టిస్తారు. అవసరమైతే ఐదు రోజులు అజేయంగా గ్రౌండ్ లో నిలబడి మ్యాచ్ గెలిపించే సత్తా ఈ ముగ్గురిలోను ఉంది. మరి చూడాలి మన భారత్ బ్యాట్స్మెన్స్, బౌలర్లు ఏం చేస్తారో... అయితే మొదటి ఓటమిని గుణపాఠం గా తీసుకున్న భారత్ కనీసం రెండో మ్యాచ్ లోనైనా గెలుస్తుందో... లేదో చూడాలి.