కేసీఆర్, కవితలపై అసభ్యరాతలు, అరెస్ట్

కేసీఆర్, కవితలపై అసభ్యరాతలు, అరెస్ట్

తెలంగాణ సీఎం కేసీఆర్, నిజామాబాద్ ఎంపీ కవితలపై ఫేస్ బుక్ లో అసభ్యరాతలు రాస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిపై దుష్ప్రచారం చేస్తూ, సీఎం ప్రతిష్టకు, ఆయన కుమార్తె కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్ బుక్ లో కామెంట్లు ఉన్నాయంటూ టీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫేస్‌బుక్‌ నిర్వాహకులను సంప్రదించి ఐపీ అడ్రసుల ఆధారంగా మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి చిప్రా నరేష్‌ ను అదుపులోకి తీసుకున్నారు.