ముగిసిన మొదటి రోజు... 24/1 తో భారత్

ముగిసిన మొదటి రోజు... 24/1 తో భారత్

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ చివరి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 205 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆ జట్టులో బెన్ స్టోక్స్(55), డేనియల్ లారెన్స్(46) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు. అయితే మొదట 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను స్టోక్స్ తన అర్ధశతకంతో ఆదుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ 4, అశ్విన్ 3, సిరాజ్ 2 వికెట్లు తీయగా సుందర్ ఒక్క వికెట్ పడగొట్టాడు. 

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆండర్సన్ మొదటి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ గిల్ ను డక్ ఔట్ గా వెనక్కి పంపాడు. దాంతో ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా(15), రోహిత్(8) తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 24/1 తో నిలిచింది. అయితే టీం ఇండియా కంటే ఇంగ్లాండ్ ఇంకా 181 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరి రేపు రెండో రోజు ఆటలో మన బ్యాట్స్మెన్స్ ఏం చేస్తారో చూడాలి.