తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం..
బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో రెండో రోజు భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది టీమిండియా. డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 243 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరగా.. ఫాస్ట్‌గా ఆడుతున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆట చివర్లో ఉమేష్ యాదవ్ సిక్సర్లతో విరుచుకుపడడం హైలైట్‌గా అయ్యింది. ఉమేష్ ఒక ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 10 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో మీడియం పేసర్ అబు జాయేద్ కు 4 వికెట్లు దక్కాయి. దీంతో ప్రస్తుతం టీమిండియా 343 పరుగుల ఆధిక్యంతో ఉంది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)