రేపు మూడో సారి చైనాతో చర్చలు !

రేపు మూడో సారి చైనాతో చర్చలు !

భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు చర్చలంటూనే చైనా యుద్ధసన్నహాల్లో బిజీగా ఉన్నాయి రెండు దేశాలు. ఎల్‌ఏసీ వెంబడి భారీగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఇలాంటి సమయంలో రేపు మూడోసారి భారత్‌, చైనా అధికారులు చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇరు దేశాల కమాండర్‌స్థాయి అధికారులు డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు. 

గల్వాన్‌లో ఘర్షణ తర్వాత..  సరిహద్దులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. భారత్ ను డైరెక్టుగా ఎదుర్కోలేని పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. గతంలో కొంత భూభాగాన్ని చైనాకు సమర్పించుకొని దాసోహమన్న పాక్ ఇప్పుడు భారత్‌పై పగ తీర్చుకునే చర్యల్లో భాగంగా చైనాకు సైనికపరంగా సహాయ సహకారాలు అందిస్తోంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని స్కర్దు వైమానిక స్థావరంలో చైనా వాయు సేనను అనుమతించింది.

ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. మన యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలను సరిహద్దుల్లోకి తరలించింది. లడఖ్ కు భారీగా అదనపు బలగాలు, సరకులను రవాణా చేస్తున్నారు. తాజా పరిణామంతో ఒక విషయంపై స్పష్టత వచ్చేసింది. POKలోని తన వైమానిక స్థావరాలను.. చైనా పూర్తిగా వినియోగించుకునేలా.. పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే. ఇలాంటి పరిస్థితిపై పూర్తి అవగాహనతో ఉన్న భారత్ చైనా సరిహద్దు పొడవునా అప్రమత్తమైంది.  వైమానిక సంపత్తిని, క్షిపణి వ్యవస్థలను మోహరించింది. ఆదేశాలు అందిన 8 నిమిషాల్లోనే దాడి చేసేలా మన యుద్ధవిమానాలు సిద్ధంగా ఉన్నాయి.