పొంచి ఉన్న ముప్పు: ఇండియా పాక్ తో పాటు ఆ దేశం కూడా నష్టపోతుందా? 

పొంచి ఉన్న ముప్పు: ఇండియా పాక్ తో పాటు ఆ దేశం కూడా నష్టపోతుందా? 

ఇండియా పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  రెండు దేశాల భౌగోళిక ఇబ్బందులతో పాటుగా పాకిస్తాన్ ఇండియాలోకి ఉగ్రవాదులను పంపుతూ అలజడులు సృష్టిస్తూ ఉంటుంది.  ఈ అలజడులనుంచి బయటపడేందుకు నిత్యం బోర్డర్ ఆర్మీ పహారా కాస్తూనే ఉంటుంది.  ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారో అప్పటి నుంచే అన్ని మారిపోయాయి.  

ఇదిలా ఉంటె, ఇప్పుడు రెండు దేశాలు ఉమ్మడిగా ఓ ముప్పును ఎదుర్కోబోతున్నాయి.  రెండు దేశాలను మిడతల దండు దాడి చేస్తోంది.  వేల ఎకరాల్లో పంటను నాశనం చేస్తోంది. ఆఫ్గనిస్తాన్ ప్రాంతం నుంచి మిడతలు లక్షల సంఖ్యలో పంటలపై దాడి చేస్తున్నాయి.  దీంతో పాక్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.  అయితే, ఇండియా ముడతలను సమర్ధవంతంగా ఎదుర్కొని కొంత సక్సెస్ అయ్యింది. వర్షాలు కురిసి పంటలు వేయడం మొదలుపెడితే  మిడతల దండు మరింతగా పెట్రేగిపోయే అవకాశం ఉన్నది.  అంతేకాదు, మిడతల పునరుత్పత్తికి మార్చి నెల అనుకూలమైనది కావడంతో వాటి సంతతిని అరికట్టేందుకు రెండు దేశాలు అనేకమార్లు చర్చలు జరిపాయి.  మిడతల దండును అరికట్టకపోతే బంగ్లాదేశ్ పై కూడా ఈ మిడతల దండు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.