తొలి వన్డే ఆడుకున్న వరుణుడు..

తొలి వన్డే ఆడుకున్న వరుణుడు..

టీ-20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి.. అదే దూకుడుతో వన్డే సిరీస్ పట్టుపట్టాలని భావించిన టీమిండియా ఆశలకు ఆదిలోనే గండి పడింది... వన్డే సిరీస్‌ ఆరంభంలోనే అడ్డు తగిలాడు వరుణుడు.. దీంతో ప్రావిడెన్స్‌ వేదికగా టీమిండియా, వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డేను రద్దు చేశారు. మ్యాచ్ ప్రారంభమైనా.. పదేపదే వరుణుడు అంతరాయం కలిగించడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది.. దీంతో రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కావడంతో ఇన్నింగ్స్‌ను మొదట 43 ఓవర్లకు కుదించేశారు. ఆ తర్వాత ఆరు ఓవర్లు సాగిందో లేదో మరోసారి భారీ వర్షం కురిసింది. కొద్దిసేపటికే వర్షం ఆగి పోవడంతో.. మరో గంట పాటు ఆగి ఆతర్వాత మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. ఇక, 13 ఓవర్ల వరకూ ఇన్నింగ్‌ సాగిన మళ్లీ వర్షం కురవడంతో అంతరాయం కలిగింది. దాదాపు గంటకు పైగా ఇదే పరిస్థితి ఉండడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్ జట్టు కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే ఆడింది.. ఒక వికెటో కోల్పోయి 54 పరుగులు చేసింది. గేల్‌ 4 పరుగులకే వెనుదిరగగా.. లూయిస్‌ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, రెండో వన్డే పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఆదివారం జరుగుతుంది.