నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్

నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరుగుతున్న టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది.  315 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాకు ఓపెనర్లు ఇక్బల్, సర్కార్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.  కాగా షమీ వేసిన 10వ ఓవర్‌లో తమీమ్ ఇక్బాల్ అవుట్ కావడంతో షకీబ్ క్రీజ్‌లోకి వచ్చి నిలకడగా ఆడుతూ అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 

ఇక హార్థిక్ పాండ్యా బౌలింగ్లో సౌమ్య సర్కార్(33), చాహల్ బౌలింగ్లో ముష్ఫికుర్(24), పాండ్య బౌలింగ్లో లిటన్ దాస్ (22 ) అవుట్ కాగా ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.  క్రీజ్‌లో షకీబ్(57), హుస్సేన్ (1)  క్రీజ్‌లో ఉన్నారు.