ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ దూకుడు

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ దూకుడు

ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విక్టరీ నమోదు చేసి జోరు మీదున్న భారత్‌.. అర్జెంటీనాతో మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగించింది. ఇవాళ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ ఫస్టాఫ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ చెరో గోల్‌ సాధించారు. పెనాల్టీ కార్నర్ రూపంలో అర్జెంటీనా ఓ గోల్ సాధించింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు ఇంకా గోల్స్ చేయలేకపోవడంతో భారత్‌ ఖాతాలోకి విజయం నమోదైంది.