పింక్‌ బాల్ టెస్ట్.. టీమిండియా గ్రాండ్ విక్టరీ

పింక్‌ బాల్ టెస్ట్.. టీమిండియా గ్రాండ్ విక్టరీ

తొలిసారి పింక్‌ బాల్‌తో డే/నైట్ టెస్ట్‌కు తెరలేపిన టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉమేష్ యాదవ్ 5 వికెట్లు, ఇషాంత్ శర్మ 4 వికెట్లు తీశారు. రహీమ్, మహ్మదుల్లా తప్ప బంగ్లా బ్యాట్స్‌ మెన్ ఎవరూ పాతిక పరుగులు కూడా చేయలేదు. రహీమ్ 74 పరుగులు చేసి రాణించినా అతనికి సహకరించేవారు లేకపోవడంతో 195 పరుగులకే బంగ్లాదేశ్ పెవిలియన్ చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 106 పరుగులకు పరిమితం చేసిన భారత్.. పింక్ బాల్ టెస్ట్ మూడో రోజే టెస్ట్ మ్యాచ్ ముగించి చారిత్రాత్మక విజయాన్ని ఖాతాలో వేసుకుంది.