బోణీ అదిరింది..

బోణీ అదిరింది..

క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియా శుభారంభం చేసింది... మెగా ఈవెంట్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో కోహ్లీసేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి.. టీమిండియా ముందు 228 పరుగుల టార్గెట్ పెట్టింది. చాహల్‌ (4/51), బుమ్రా (2/35), భువనేశ్వర్‌ (2/44)తో సౌతాఫ్రికాను కట్టడి చేశారు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్స్ ఆమ్లా (6), డికాక్‌ (10), డుప్లెసిస్‌ (38),  డసెన్‌ (22) ఇలా ఓ దశలో 78/2తో ఉన్న దక్షిణాఫ్రికా 23 ఓవర్లలో 89/5కు చేరుకుంది. డసెన్‌, డుప్లెసిస్‌లను చాహల్‌ ఒకే ఓవర్లో ఔట్‌ చేయగా.. డుమిని (3)ని కుల్‌దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  ఐతే మిల్లర్‌ (31), ఫెలుక్వాయో (34) దక్షిణాఫ్రికా కుప్పకూలకుండా ఆపారు. ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. వీళ్లిద్దరినీ చాహల్‌ ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 158/7కు చేరుకుంది. కానీ మోరిస్‌, రబాడల పోరాటంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ జంట ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జోడించింది. దీంతా ఆ జట్టు స్కోరు 227కు చేరింది.

ఇక 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రోహిత్‌ శర్మ 122 (నాటౌట్‌) సూపర్‌ శతకానికి తోడు... ఎంఎస్ ధోని 34, కేఎల్ రాహుల్‌ 26 కీలక ఇన్నింగ్స్‌ తోడవడంతో లక్ష్యాన్ని భారత్‌... 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 122 పరుగులతో నానౌట్‌గా నిలిచిన రోహిత్‌ శర్మను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

దక్షిణాఫ్రికా బ్యాటింగ్: ఆమ్లా 6; డికాక్‌ 10; డుప్లెసిస్‌ 38; వాండెర్‌ 22; మిల్లర్‌ 31; డుమిని 3; ఫెలుక్వాయో 34; మోరిస్‌ 42; రబాడ 31 (నాటౌట్‌); తాహిర్‌ 0 (నాటౌట్‌)

భారత్‌ బ్యాటింగ్: శిఖర్ ధావన్‌ 8; రోహిత్‌ శర్మ 122 (నాటౌట్‌); విరాట్ కోహ్లి 18; కేఎల్‌ రాహుల్‌ 26; ఎంఎస్ ధోని 34; హార్దిక్‌ పాండ్య 15 (నాటౌట్‌)