బ్రిస్బేన్ టెస్ట్.. ఆసీస్ ఆలౌట్..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నాల్గో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ స్కోరే చేసింది.. తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది ఆసీస్ జట్టు.. బ్రిస్బేన్ వేదికగా జరుగుతోన్న ఈ టెస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ జట్టు.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.. ఇక, రెండో రోజు ఉదయం 95 పరుగులు జోడించి మరో ఐదు వికెట్లు కోల్పోయింది.. రెండోరోజు లంచ్ సమయానికి ఆసీజ్ జట్టు 369 పరుగులకే ఆలౌట్ అయ్యాంది.. అయితే, రెండోరోజు తొలి సెషన్లో భారత బౌలర్లు రాణించారు.. భారత బౌలర్లలో సుందర్ 89 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. 78 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు నటరాజన్.. ఇక, 94 పరుగులు వచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు ఠాకూర్. మొత్తంగా తొలి ఇన్సింగ్స్లో మంచి స్కోరే సాధించింది ఆసీస్ జట్టు.. అసలే గాయాల బెడదతో సతమతం అవుతోన్న భారత జట్టు బ్యాటింగ్లో ఎలా రాణిస్తుందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)