చోక్సిని రప్పించేందుకు రెడ్ కార్నర్ అక్కర్లేదు

చోక్సిని రప్పించేందుకు రెడ్ కార్నర్ అక్కర్లేదు

పంజాబ్ నేషనల్ బ్యాంకు కోట్ల రూపాయలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ భారత్ కు రప్పించేందుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు అక్కర్లేదని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖకు సీబీఐ స్పష్టంచేసింది. కనిపించకుండా పోయిన వారికైతే రెడ్ కార్నర్ నోటీసు అవసరం అవుతుందని తెలిపారు. కానీ చోక్సీకి ఆంటిగ్వా పౌరసత్వం ఉంది. ఆయనకు ఆదేశం పాస్ పోర్ట్ కుడా ఉంది. ఆయన అక్కడే ఉన్నారని తేలింది. ఆ దేశం కూడా దృవీకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో చోక్సీని రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు అవసరం లేదని సీబీఐ స్పష్టం చేసింది. ఆంటిగ్వాకు ఇప్పటికే చోక్సీ విషయం గురించి వివరించామని సీబీఐ అధికారులు తెలిపారు. చోక్సి అరెస్ట్ కోసం ఆంటిగ్వాను కోరినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మరోవైపు...  భారత జైళ్లలో సదుపాయాలు బాగుండవని ఛోక్సీ అన్నారు. భారత జైళ్లు మానవ హక్కులను ఉల్లంఘిస్తాయని ఆరోపించారు. కాగా.. ఛోక్సీ ఆరోపణలపై సీబీఐ ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. ‘నిబంధనలకు అనుగుణంగానే భారతలో జైళ్లను నిర్వహిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ కమిటీ ఉందని తెలిపారు.