విమాన సర్వీసులు రద్దు..

విమాన సర్వీసులు రద్దు..

భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.. భారత వాయుసేన దాడులను జీర్ణించుకోలేని పాక్.. కవ్వింపు చర్యలకు దిగుతుండగా.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం విమానాల రాకపోకలపై పరిమితులు విధించింది. ముందస్తుగా దేశంలోని కొన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.. జమ్మూ, శ్రీనగర్, లేహ్‌, అమృత్‌సర్‌,ఛత్తీస్‌గఢ్‌, ధర్మశాల, డెహ్రాడూన్ విమానాల సర్వీసులను నిలిపివేసినట్టు ప్రకటించాయి విమానయాన సంస్థలు. మరోవైపు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల దగ్గర నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.