ఇండియాలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు...

ఇండియాలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు...

ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  పాజిటీవ్ కేసుల సంఖ్య త‌గ్గుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌మాత్రం రోజురోజుకు భ‌య‌పెడుతూనే ఉన్న‌ది.  తాజాగా దేశంలో 12,923 కరోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 1,08,71,294 కు చేరింది.  ఇందులో 1,05,73,372 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,42,562 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 108 మంది మృతి చెందారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో క‌రోనాతో మృతిచెందిన‌వారి సంఖ్య 1,55,360కి చేరింది.