దేశంలో కరోనా విలయం : 94 లక్షలకు చేరువలో కేసులు

దేశంలో కరోనా విలయం : 94 లక్షలకు చేరువలో కేసులు

ప్రపంచంలో కరోనా ఉదృతి పెరుగుతున్నా ఇండియాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41,810 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,92,920 కి చేరింది.  ఇందులో 88, 02, 267 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,53, 956 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 496 కరోనా మరణాలు సంభవించాయి.  దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,36, 696 కి చేరింది.  ఇటు గడిచిన 24 గంటల్లో 42,298 మంది కరోనా నుంచి కోలుకున్నారు.