ఇండియా చైనా దేశాల మధ్య కీలక చర్చలు... సమదూరం పాటించాలని నిర్ణయం 

ఇండియా చైనా దేశాల మధ్య కీలక చర్చలు... సమదూరం పాటించాలని నిర్ణయం 

గత కొన్ని రోజులుగా ఇండియా చైనా దేశాల సరిహద్దుల్లో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.  రెండు దేశాల సైన్యం సరిహద్దుల్లో భారీగా మోహరించిన విషయం తెలిసిందే.  నువ్వా నేనా అన్నట్టుగా బలగాలు మోహరించాయి.  ఏ క్షణం ఏం జరుగుతుందో అనేంత టెన్షన్ వాతావరణం నెలకొన్నది.  ఇప్పటికే రెండు దేశాలకు చెందిన సైనికాధికారులు అనేక దఫాలుగా చర్చలు జరిపారు.  కానీ, ఎలాంటి పురోగతి కనిపించలేదు.  అయితే, రష్యాలోని మాస్కోలో జరుగుతున్న షాంగై సహకార కూటమి సమావేశంలో ఇండియా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో ఇండియా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి పాల్గొన్నారు.  

ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి.  సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికే దిశగా చర్చలు జరిగాయి.  ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించాలని నిర్ణయించాయి.  మొత్తం 5 అంశాల ప్రణాళిక అమలు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మంచివి కాదని, అవి ఇరు దేశాలకు ఇబ్బందులు తెచ్చిపెడతానని, రెండు దేశాల సైన్యం సమదూరం పాటించాలని విదేశాంగ మంత్రులు తెలిపారు.  సరిహద్దు వివాదంపై పరస్పర చర్చలు కొనసాగించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.