సంధినా?..సమరమా?...జూన్‌ 6న భారత్, చైనా సైనికాధికారుల కీలక భేటీ

సంధినా?..సమరమా?...జూన్‌ 6న భారత్, చైనా సైనికాధికారుల  కీలక భేటీ

భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దులో చెలరేగిన వివాదం తాజా ఉద్రిక్తతలకు దారితీస్తుంది..రోజురోజుకు బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి...రెండు దేశాల సరిహద్దు వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవడంతో లడఖ్ లో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి..అమెరికా జోక్యం అవసరం లేదని భారత్‌-చైనా దేశాలు ఇప్పటికే అగ్ర దేశానికి స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ దూకుడు మాత్రం తగ్గించుకోవడం లేదు...పైగా రోజుకో ట్విట్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచున్నారు..తాజాగా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రెండు దేశాల ఆర్మీ ఆధికారుల సమావేశం కానున్నారు...జూన్ 6 న లడఖ్‌లో భారత్, చైనా అగ్ర శ్రేణి సైనిక స్థాయి చర్చలు జరగనున్నాయి..మిలిటరీ, దౌత్య స్థాయుల్లో వివాద పరిష్కారానికి భారత్ మరియు చైనా దేశాలూ ప్రయత్నాలు చేస్తున్నాయి..

అయితే ఈ అంశంలో భారత్‌ తన వైఖరి నుంచి వెనక్కి తగ్గబోదని స్పష్టంచేశారు... ప్రస్తుత సమస్య పరిష్కారానికి కూడా గతంలో డోక్లామ్‌ తరహాలో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.ఇది మంచి పరిణామంగా భావించవచ్చు...ట్రంప్‌ రెచ్చగొట్టే విధానాలతో అటు చైనా..ఇటు ఇండియా రెండు దేశాలు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి..ఇప్పటికే లడఖ్ లోని వివాదాస్పద భూభాగంలో భారత, చైనా దళాలు భారీగా యుద్ధ శకటాలను మోహరిస్తున్నాయి..ఆయుధ సామాగ్రిని చేరవేస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధం కావాలని చైనా మిలటరీ కి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో భారతదేశం కూడా యుద్ధ సన్నాహాలలో మునిగిపోయింది...


చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని రెండు దేశాలు రాయబారులు ఇప్పటికే ప్రకటించారు...కాని ట్రంప్‌ భారత్‌తో కోనసాగిస్తున్న సంబంధాలు,చైనాపై విమర్శలు చేస్తుండటంతో భారత్‌పై చైనా గుర్రుగా ఉంది..అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దంలో భాగం కావోద్దని చైనా అధ్యక్షుడు భారత్‌కు విజ్ఞప్తి చేశారు...ఒకే వేల భారత్‌ అమెరికాతో చేతులుకలిపితే భారత్‌ భారీ ముల్యం చెల్లించక తప్పదని చైనా హెచ్చరించింది..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌  రెచ్చగోట్టే ప్రకటనలతో...ఇప్పుడు ఈ చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం దోరికే అవశాలు తక్కువగా కన్పిస్తున్నాయి...