ఇండియాలో మళ్ళీ భారీగా నమోదయిన కేసులు

ఇండియాలో మళ్ళీ భారీగా నమోదయిన కేసులు


దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువైంది. అయితే రికవరీ రేటు అంతకంతకూ పెరుగుతూ ఉండడం ఊరటనిస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే ఏపీలో కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో నిలకడగా కొనసాగుతున్నాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల్లో 86,821 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,12,585 కు చేరింది. రెండు మూడు రోజులుగా కరోనా కేసులు 70వేల దాకా నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య మళ్లీ పెరిగింది. పాజిటివ్‌ కేసుల్లో సుమారు 52,73,202 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,181 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య  98,678కు పెరిగింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 83.33శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.57శాతంగా ఉంది.