ఇండియా కరోనా అప్డేట్: కొత్తగా ఎన్నంటే 

ఇండియా కరోనా అప్డేట్: కొత్తగా ఎన్నంటే 

దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకు 16వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  కేసులు పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.  మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 16,752 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,96,731కి చేరింది. ఇందులో 1,07,75,169 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,64,511 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 113 మంది మరణించారు.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,051కి చేరింది.