ఇండియా కరోనా అప్డేట్స్: మళ్ళీ పెరిగిన కేసులు...మరణాలు

ఇండియా కరోనా అప్డేట్స్: మళ్ళీ పెరిగిన కేసులు...మరణాలు

ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 3,82,315 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148 కి చేరింది. ఇందులో 1,69,51,731 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,87,229 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3780 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,26,188కి చేరింది.